ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:31 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కన్నెపల్లి మండలంలో రూ.2.25 కోట్లతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనానికి స్థల పరిశీలించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి

కన్నెపల్లి మండలంలో రూ.2.25 కోట్లతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనానికి స్థల పరిశీలించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి

అర్జున సమాచారం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 13

కన్నెపల్లి మండల కేంద్రంలో రూ.2.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయ భవనానికి అవసరమైన స్థలాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పరిశీలించారు.
ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ రామచందర్ , మాజీ ఎంపీపీ సృజన నర్సింగరావు ఏసిపి కిరణ్ కుమార్ ,సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించి, నూతన కార్యాలయ భవన నిర్మాణానికి అనువైన స్థలం, అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు సౌకర్యవంతమైన, ఆధునిక వసతులతో కూడిన తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
భవన నిర్మాణానికి సంబంధించిన పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.